ఢిల్లీ నుంచి అక్రమ మద్యం ట్రాన్స్ పోర్ట్ ..  15 మంది అరెస్ట్ 

ఢిల్లీ నుంచి అక్రమ మద్యం ట్రాన్స్ పోర్ట్ ..  15 మంది అరెస్ట్ 

ఎల్బీ నగర్, వెలుగు: గోవా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పన్ను చెల్లించకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న 15 మంది సభ్యుల ముఠాను స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మీర్​పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దాడిలో నిందితుల నుంచి భారీ ఎత్తున మద్యం సీసాలతో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్​కు తరలించారు. ఈ సందర్భంగా ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.